జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ , ఎమ్మార్పీఎస్ & అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో పార్లమెంట్లో అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసన చేపట్టడం జరిగింది.
అందులో భాగంగా నాయకులు అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి , అమిత్ షా వెంటనే రాజ్యసభ పదవికి రాజీనామా చేయాలని , అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ నాయకులు తిరుపతి, పోషరాజు, రాజేందర్, లక్ష్మణ్, ఎమ్మార్పీఎస్ నాయకులు జితేందర్, లక్ష్మణ్, పెద్దిరాజు, అంబేద్కర్ సంఘ నాయకులు చంద్రమౌళి నవీన్, నరసయ్య, సోకేస్, అంజి, ప్రవీణ్, సతీష్, గణేష్ పోషరాజు తదితరులు పాల్గొన్నారు.