బీఆర్ అంబేద్కర్ పై హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తక్షణమే ఉపసంహరించుకోవాలని, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం అంబేద్కర్ విగ్రహం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు ధరించి, ప్లే కార్డ్స్ పట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు మంద ధర్మయ్య మాట్లాడుతూ పార్లమెంట్ లో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, పార్లమెంట్ లో అమీత్ షా భీంరావు అంబేద్కర్ జీ పేరును తీసుకోవడం ఫ్యాషన్ అయిందని.
అంబేద్కర్ పేరుకు బదులు దేవుని స్మరిస్తే ఏడుతరాల స్వర్గం ప్రాప్తిస్ధది అని హేళన చేసే విధంగా మాట్లాడటం అంటే అంబేద్కర్ పట్ల అంబేద్కర్ వాదుల పట్ల బీజేపీ వాళ్ళ నిజ స్వరూపం బయటపడిందన్నారు.రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్రలను బీజేపీ విడనాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చింతకింది శంకర్, భీమ్ రెడ్డి మల్లారెడ్డి, కర్ర రవీందర్, బసవరాజ్ శంకర్, బీనవేణి రాకేష్, వేల్పుల వెంకటస్వామి, చిగురు కొమురయ్య, అంకుష్, పున్నం సత్యం, పులి రాజు, దయాకర్, మంద శ్రీనాథ్, గాజుల రవీందర్, బైరి సుధాకర్ మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.