చెరుకుపల్లి లో జాతీయ రహదారిపై వెళ్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. నల్గొండకు చెందిన ఒక కుటుంబం గురువారం విజయవాడ దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి డివైడర్ పైకి ఎక్కింది. ఈ ప్రమాదంలో కారు ముందు టైరు పగిలిపోగా ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. విజయవాడ నుండి కరకట్ట మీదుగా నల్గొండకు వెళుతుండగా కారు ప్రమాదానికి గురైంది.