నిర్మల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ సీనియర్ నాయకులు పీవీ మహేశ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో మహేశ్ రెడ్డి గులాబీ గూటికి చేరారు. ఈ సందర్భంగా మహేశ్ రెడ్డికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నిర్మల్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని మహేశ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు రామకృష్ణారెడ్డి, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa