ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ రిపబ్లిక్ డే వేడుకలకు 'తెలంగాణ స్పెషల్ గెస్టులు'.. 41 మందికి ప్రత్యేక ఆహ్వానం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 12, 2025, 07:03 PM

జనవరి 26వ తేదీన దేశ రాజధాని న్యూఢిల్లీలో జరగబోయే 76వ గణతంత్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. రిపబ్లిక్ డే పరేడ్ కోసం.. అన్ని దళాలు సిద్ధమవుతుండగా.. ఈ వేడుకలకు హాజరయ్యే ప్రత్యేక అతిథులకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానాలు పంపుతోంది. అయితే.. ఈసారి వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. కాగా.. ప్రత్యేక అతిథులుగా దేశంలో పలు రాష్ట్రాల నుంచి ఎంతో మందిని కేంద్ర ప్రభుత్వ ఆహ్వానించి వారు చేసిన సేవలను గుర్తించి గౌరవిస్తుంది. ఇందులో భాగంగానే.. ఈసారి రిపబ్లిక్ డే వేడుకలకు తెలంగాణ నుంచి ఏకంగా 41 మంది స్పెషల్ గెస్టులను కేంద్ర సర్కార్ ఆహ్వానించటం విశేషం.


కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన వ్యక్తులను ఎంపిక చేసి, వారికి ప్రత్యేక ఆహ్వానాన్ని అందించింది. అయితే.. 41మందిలో వివిధ రంగాల్లో తమ ప్రతిభను చాటుకున్నవారితో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థంగా ఉపయోగించుకున్నవారు కూడా ఉంటారు. తెలంగాణ నుంచి ప్రత్యేకంగా ఎంపికైన వాళ్లంతా.. కేంద్ర ప్రభుత్వ పథకాలను సంపూర్ణంగా వినియోగించుకున్నవారు. పీఎం యశస్వి పథకం, టెక్స్‌టైల్ హస్తకళల పథకాలు, గ్రామీణ అభివృద్ధి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ వంటి విభాగాలు వారి జీవితాలను మార్చడంలో కీలక పాత్ర పోషించినట్టు గుర్తించారు.


రిపబ్లిక్ డే పరేడ్ స్టేట్ నోడల్ ఆఫీసర్ అంకం రాజేశ్వర్, పీఎం జన్మన్, మహ్మద్ ఖాదీర్ అహ్మద్ తదితర అధికారులు ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎంపికైన లబ్ధిదారుల గౌరవార్థం ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమాల్లో వీరిని ప్రజెంట్ చేయటం దేశానికి గర్వకారణమని వారు అభిప్రాయపడ్డారు.


తెలంగాణ నుంచి ఎంపికైన అతిథులు


ప్రధానమంత్రి యశస్వి పథకం- 23 మంది


టెక్స్‌టైల్స్ (హస్తకళలు) – 3 మంది


డబ్ల్యూసీడీ (వుమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్) – 5 మంది


రూరల్ డెవలప్మెంట్ విభాగం (గ్రామీణ అభివృద్ధి పథకాలు)- 12 మంది


పీఎం మత్స్య సంపద యోజన – 4 మంది


నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ విభాగం – ఈ విభాగంలో శిక్షణ పొందిన అత్యుత్తమ ట్రైనీగా శ్రావ్య ఎంపికయ్యారు.


గిరిజన వ్యవహారాల విభాగం – 7 మంది.


మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్న 15 మందితో కలిపి మొత్తం 41 మంది.


వీళ్లందరినీ కేంద్ర రక్షణ శాఖ ద్వారా జరిగింది. ఈ అతిథుల ఢిల్లీ పర్యటన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వీరి కోసం నోడల్ అధికారులను కూడా నియమించారు. ఈ ప్రత్యేక అతిథుల ఎంపికతో గణతంత్ర దినోత్సవంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు లభించినట్టయింది. ఈ 41 మంత్రి స్పెషల్ అతిథులు.. కేవలం పరేడ్‌ను వీక్షించడమే కాకుండా, దేశవ్యాప్తంగా వివిధ రంగాలలోని ప్రతిభావంతులుగా ప్రశంసలందుకుంటారు.


వీరిని గౌరవించడానికి కేంద్ర ప్రభుత్వం పలు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ పర్యటనతో వీరికి దేశభక్తి, స్ఫూర్తి కలిగేలా చర్యలు తీసుకోవడం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా తెలంగాణ ప్రజలు తమ ప్రతిభను దేశవ్యాప్తంగా చాటుకున్నట్టవుతుంది. ఈ ఎంపికలతో తెలంగాణ.. రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో ఒక మంచి ఆదర్శంగా నిలుస్తోందని జాతికి ఒక సందేశం ఇచ్చినట్టు కూడా ఉంటుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa