సంక్రాంతి పండుగ వేళ.. పిల్లలంతా కలిసి సరదాగా గాలిపటాలు ఎగరేయాలనుకున్నారు. అందుకోసం.. దగ్గర్లో ఉన్న గుట్టపైకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా.. అందరూ కలిసి గుట్టపైకి చేరుకున్నారు. తమతో తెచ్చుకున్న గాలిపటాలను ఎగరేస్తూ.. కేరింతలు కొడుతున్నారు. అందులో ఒక గాలిపటం తెగిపోగి.. అక్కడే ఉన్న ఓ చెట్ల పొదల్లో పడిపోయింది. అయితే.. ఆ గాలిపటాన్ని తీసుకునేందుకు వెళ్లిన యువకులకు.. ఆ పొదల పక్కన కనిపించిన సన్నివేశం చూసి.. ఒక్కసారిగా షాక్ అయ్యారు. గుండెలను అరచేతిలో పెట్టుకుని.. దెబ్బకు గుట్ట దిగారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.
హైదరాబాద్ నార్సింగిలో దారుణ ఘటన వెలుగు చూసింది. సంక్రాంతి పండగ వేళ జంట హత్యలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. పుప్పాల్‌గూడ అనంత పద్మనాభస్వామి దేవాలయం గుట్టపై ఇద్దరి మృతదేహాలు ప్రత్యక్షమవటం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా స్థానికంగా ఉండే చిన్నారులు, యువకులు గాలిపటాలు ఎగరవేసేందుకు.. పక్కనే ఉన్న అనంత పద్మనాభస్వామి గుట్టపైకి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. దీంతో చిన్నారులు, యువత అంతా కలిసి గుట్టపైకి చేరుకున్నారు.
అయితే.. గాలిపటాలు ఎగరేస్తున్న సమయంలో అందులో ఒకటి తెగిపడడంతో వాటిన తెచ్చుకునేందుకు వెళ్లారు. తీరా పొదల పక్కన కనిపించిన దృశ్యాలు చూసి షాక్ అయ్యారు. పొదల్లోకి వెళ్లిన యువకులకు ఇద్దరి మృతదేహాలు కనిపించడంతో వారి నోట మాట రాలేదు. దీంతో వెంటనే అక్కడి నుంచి పరుగులు పెట్టారు. అనంతరం100కి డయల్ చేసి సమాచారాన్ని పోలీసులకు అందించారు. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులతో కలిసి మృతదేహాలను పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ బృందాలు సైతం రంగంలోకి దిగి వివరాలు సేకరించే పనిలో పడ్డారు.
మృతుల్లో ఒక మహిళతో పాటు మరో పురుషుడు ఉన్నట్లు నార్సింగి పోలీసులు గుర్తించారు. గుర్తుతెలియని దుండగులు మహిళపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహిళతో ఉన్న వ్యక్తిని అతి దారుణంగా హత్య చేసినట్లు గుర్తించారు. అతని తలను బండరాయితో మోది హత్య చేసి.. అనంతరం మృతదేహాన్ని కాల్చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరి మృతదేహాలు ప్రస్తుతం గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు.
అయితే ముందుగా మహిళపై హత్యాచారం చేసి అనంతరం అతడిని అంతమెుందించినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఘటనా స్థలంలో పెద్దఎత్తున ఖాళీ మద్యం సీసాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించటంతో.. అనుమానాలు మరింత ఎక్కువవుతున్నాయి. నిందితులు మద్యం మత్తులో హత్యలకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు జంట హత్యలకు పాల్పడిన నిందితులను పట్టుకునే దిశగా దర్యాప్తు చేపట్టారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa