వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం జంగమయ్యపల్లి గ్రామ శివారులోని కొములగట్టు వెంకటేశ్వర స్వామికి గురువారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ కనుమ మరుసటి రోజున శ్రీస్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి రమేష్ గౌడ్, మాజీ సర్పంచ్ సతీష్, సుభాష్ గౌడ్, బాల్ రాజ్, ఆంజనేయులు గౌడ్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |