ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అఫ్జల్గంజ్ కాల్పుల ఘటన... నిందితుల కోసం కొనసాగుతున్న పోలీసుల వేట

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 18, 2025, 02:56 PM

హైదరాబాద్‌లో కాల్పులకు  తెగబడ్డ నిందితుడిని మనీశ్‌గా గుర్తించారు. ఇతడు బీహార్‌ రాష్ట్రానికి చెందిన వాడుగా పోలీసులు తెలిపారు.మనీష్‌తో బీహార్ రాష్ట్రానికి చెందిన మరో నిందితుడు జతకట్టాడు. వారం రోజుల క్రితం నిందితుల చోరీలు మొదలు పెట్టారు. ఛత్తీస్‌గడ్‌లో వారం రోజుల క్రితం ఏటీఎం సిబ్బందిని బెదిరించి 70 లక్షల రూపాయలు మనీష్ అండ్ కో కాజేశారు. అనంతరం గురువారం (జనవరి 16) బీదర్‌లో ఏటీఎం సెక్యూరిటీ గార్డ్‌ను హత్య చేసి రూ.93 లక్షలు మనీశ్ ఎత్తుకెళ్లాడు. బీదర్ నుంచి హైదరాబాద్ వచ్చిన మనీశ్.. అఫ్జల్‌గంజ్‌లో కాల్పులు జరిపాడు.ఇప్పటికే మనీశ్‌పై బీహార్ ప్రభుత్వం రివార్డు ప్రకటించింది. గతంలోనూ మనీష్‌పై మర్డర్, దోపిడి కేసులు ఉన్నాయి. గతంలో కేసులు నమోదైనప్పుడు మనీష్ బార్డర్ దాటి నేపాల్ పారిపోయాడు. కేసుల తీవ్రత తగ్గాక ఇండియాకు వచ్చి మళ్లీ దోపిడీలకు పాల్పడుతున్నాడు మనీశ్‌. మనీశ్‌ను పట్టుకునేందుకు నాలుగు రాష్ట్రాల పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తెలంగాణ, బీహార్, కర్ణాటక, చత్తీస్‌గడ్‌లో మనీశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
హైదరాబాద్ అఫ్జల్‌గంజ్ కాల్పుల ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. అఫ్జల్‌గంజ్ నుంచి ఆటోలో సికింద్రాబాద్‌ వెళ్లిన నిందితులు అక్కడ బట్టలు, బ్యాగులు కొనుగోలు చేశారు. తిరుమలగిరి వద్ద ఓ నిర్మానుశ్య ప్రదేశంలో బట్టలు, బ్యాగులు మార్చుకున్నారు. తిరుమలగిరిలో బ్యాగులను నిందితులు వదిలేశారు. ట్రాలీ బ్యాగ్‌ను అక్కడే వదిలేసి పారిపోయారు. సుచిత్ర వైపు నిందితులు పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ట్రాలీబ్యాగులను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. దాదాపు పది బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఖచ్చితంగా కేసును చేధిస్తామని పోలీసులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా.. ఈనెల 16న బీదర్‌లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఏటీఎంలో సిబ్బంది నగదును జమ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి డబ్బును అపహరించేందుకు యత్నించారు. అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సెక్యూరిటీ సిబ్బందితో పాటు మరొకరు చనిపోయారు. దుండగులు దాదాపు రూ.93 లక్షల నగదును తీసుకుని అక్కడి నుంచి పరాయ్యారు. అనంతరం హైదరాబాద్‌కు వచ్చిన దుండగులు రాయపూర్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. బస్సులో వెళ్లాలని రోషన్ ట్రావెల్స్‌లో టికెట్స్ తీసుకున్నారు. రాయపూర్ వెళ్లేందుకు అమిత్ కుమార్‌తో టికెట్‌ బుక్ చేసుకున్నారు. అనంతరం బస్సులో ఎక్కిన సమయంలో ట్రావెల్స్ ఉద్యోగి జహంగీర్ వీరి బ్యాగ్‌ను తనిఖీ చేశాడు. ఓ బ్యాగ్‌లో హెల్మెట్, వస్త్రాలు ఉన్నట్లు గుర్తించారు. మరో బ్యాగ్‌ను తనిఖీ చేయాలని జహంగీర్ ప్రయత్నించాడు. అందుకు వాళ్లు ఒప్పుకోలేదు. అనుమానం వ్యక్తం చేసిన ట్రావెల్స్‌ ఉద్యోగి పోలీసులకు చెబుతానంటూ బెదిరించాడు. దీంతో వెంటనే దుంగులు జహంగీర్‌పై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. దుండగులు ఎక్కడెక్కడి వెళ్లారు అనేది సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు గుర్తించారు. దుండగుల కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.


మరోవైపు అఫ్జల్‌గంజ్ నుంచి దుండగులు ఓ ఆటో ఎక్కి పరారైనట్లు పోలీసులు కనుగొన్నారు. దీంతో ఆటో డ్రైవర్‌ను గుర్తించిన పోలీసులు.. అతడి అదుపులోకి తీసుకున్నారు. అఫ్జల్‌గంజ్ నుంచి సికింద్రాబాద్ వరకు దొంగలను ఆటో డ్రైవర్ తీసుకువెళ్లాడు. దీంతో దొంగలు ఎక్కడ దిగారని పోలీసులు ప్రశ్నించగా.. సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ వద్ద దొంగలను వదిలిపెట్టినట్టు ఆటో డ్రైవర్ తెలిపారు. ఆటోలో కూర్చున్నప్పుడు దొంగలు ఏమైనా మాట్లాడుకున్నారా అనే దానిపై ఆరా తీస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com