హైదరాబాద్‌లోని లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు చిత్తాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలును అడ్డుకున్నారు. చిత్తాపూర్ - సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న ఈ రైలు సరైన సమయానికి రావడం లేదని ఆందోళనకు దిగారు. ప్రతిరోజు ఉ.7:30 గంటలకు లింగంపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకోవాల్సిన రైలు.. 3, 4 గంటలు ఆలస్యంగా నడుస్తోందని ఆరోపించారు. దీంతో ఉద్యోగాలకు వెళ్లే వారు సకాలంలో కార్యాలయాలకు చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa