ట్రెండింగ్
Epaper    English    தமிழ்

HYD నుంచి వియత్నాంకు విమాన సర్వీస్.. ఎప్పటి నుంచి అంటే?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 23, 2025, 11:08 AM

హైదరాబాద్‌-వియత్నాంల మధ్య మరో విమాన సర్వీసు అందుబాటులోకి రాబోతున్నది. మార్చి 18న ఈ నూతన సర్వీసును ప్రారంభించబోతున్నట్లు వియట్‌జెట్‌ ప్రకటించింది. హైదరాబాద్‌తోపాటు బెంగళూరు మధ్య ప్రారంభంకానున్న ఈ నూతన సర్వీసు సందర్భంగా ప్రారంభ విమాన టికెట్‌ ధర పన్నులు కలుపుకొని రూ.11గా నిర్ణయించింది. ఈ నెల 30 వరకు బుకింగ్‌ చేసుకున్న ప్రయాణికులు ఫిబ్రవరి 10 నుంచి సెప్టెంబర్‌ 30 లోగా ప్రయాణించాల్సి ఉంటుందని తెలిపింది. దీంతోపాటు బిజినెస్‌, స్కైబాస్‌ టికెట్‌పై 20 శాతం తగ్గింపు ధరకు విక్రయిస్తున్నది. ఈ సర్వీసు కేవలం మంగళ, శనివారాలు మాత్రమే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa