దావోస్ పెట్టుబడుల విమర్శలలో భాగంగా బీఆర్ఎస్ నేతలు ENO వాడాలని కాంగ్రెస్ సర్కారు ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కీలక వ్యాఖ్యలు చేశారు. 'మాకేదో జీర్ణం కావడంలేదని ENO ప్రచారమెందుకు?. పెట్టుబడులు ఎక్కడో ప్రజలకు చూపాలి' అని KTR సవాల్ విసిరారు. నిజం గడప దాటేలోపే అబద్ధం ఊరంతా ప్రచారం అయినట్లు.. సీఎం రేవంత్ తీరు ఉందని KTR మండిపడ్డారు.