వేములవాడ )లో లారీ బీభత్సం సృష్టించింది (Road Accident). మొదటి బైపాస్ రహదారి మహాలక్ష్మి వీధిలోని విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి అటునుంచి మూలవాగు వంతెనపై డివైడర్లను లారీ ఢీకొట్టి..తిప్పాపూర్‌లోని కదిరే రాజమల్లయ్య దుకాణంలోకి దూసుకు వచ్చింది. ఈ ఘటనలో రాజ మల్లయ్య ద్విచక్ర వాహన కన్సల్టెన్సీలోని ఐదు వాహనాలు ధ్వంస మయ్యాయి. డ్రైవర్ అతిగా మద్యం సేవించడం వల్లే ప్రమాదం జరిగిందని కాలనీవాసుల వెల్లడించారు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa