హైదరాబాద్ లో గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) కేసు నమోదైంది. సిద్దిపేట మండలానికి చెందిన మహిళకు జీబీఎస్ ఉన్నట్లు వైద్యులు నిర్ధరించారు.బాధితురాలు ఓ ప్రయివేటు ఆస్పత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతోంది. ఇప్పటికే మహారాష్ట్రలో వంద వరకు ఈ కేసులు నమోదైన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో గులియన్ బారే సిండ్రోమ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురిచేస్తోంది. బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా బలహీన రోగనిరోధక శక్తి కలిగిఉన్న వ్యక్తులు ఈ జీబీఎస్ బారినపడే అవకాశాలు ఉంటాయని వైద్యులు వెల్లడించారు. శరీరానికి సోకిన ఇన్ఫెక్షన్కు ప్రతిస్పందించే రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున నరాలపై దాడి చేసే అరుదైన పరిస్థితి ఇది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa