కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసులపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పందించారు. కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన నోటీసులు తనకు ఇంకా అందలేదు అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వెల్లడించారు.నోటీసులు వస్తే సమాధానం చెప్తానని తీన్మార్ మల్లన్న చెప్పుకొచ్చారు. నాకు బీఫామ్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గౌరవిస్తా.. నాపైఅగ్రవర్ణాలు కుట్రచేస్తున్నాయి అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపించారు.కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేయడం పట్ల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మండిపడ్డారు. నోటీసుల జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నాకు ఎందుకు నోటీసులు ఇవ్వాలని ప్రశ్నించారు. పార్టీ ఏమన్నా.. మీ అయ్య జాగీరా..కాంగ్రెస్ పార్టీ మాది ..బీసీలది'అంటూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీని వాడుకుంటున్న మీరు పెత్తనం చేసుకుంటా నన్ను బెదిరించాలని..డమ్కీలు ఇస్తామంటే నడవదు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బీసీలకు అన్యాయం జరిగితే బీసీలు పండబెట్టి తొక్కుతారంటూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'రాహుల్ గాంధీ ఆశయాలతో కాంగ్రెస్ పార్టీని పది కాలాల పాటు కాపాడాలనుకునే వారికి తమతో ఎలాంటి ఇబ్బంది లేదు అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు.
సమగ్రకుల సర్వే కాదు అగ్రకుల సర్వే
కుల గణన నివేదికపై బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు మాట్లాడకపోవడంపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మండిపడ్డారు. ఎమ్మెల్యేలు మాట్లాడకపోవడానికి వారి సమస్యలు వారికి ఉండవచ్చునని అలాంటి వారిని ప్రజలే చూసుకుంటారని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కుల గణన పూర్తిగా తప్పుల తడకగా ఉందని చెప్పాల్సింది పోయి...పారదర్శకంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్పడం దుర్మార్గం అంటూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మండిపడ్డారు. 'బీసీ ప్రజలారా, ఇది సమగ్ర కుల సర్వే కాదు. ఇది అగ్ర కుల సర్వే. ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లను కాపాడుకోవడానికి జానారెడ్డి ఆడిన నాటకమే ఈ సర్వే. దీనికి ఎలాంటి ప్రమాణాలు పాటించలేదు'అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విమర్శించారు.
ఇదంతా జానారెడ్డి కుట్రలో భాగమే
అంబర్ పేట తులసీనగర్ కాలనీలో 20వేల మంది బీసీలు ఉంటే అక్కడ సర్వేనే జరగలేదు అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. అలాగే గోల్నాకాలో, మల్కాజ్‌గిరిల కూడా అదే పరిస్థితి అని..అందుకే ఇది ఫేక్ సర్వే అని..అన్ని దొంగ లెక్కలేనని తాను బల్లగుద్ది చెప్తున్నట్లు స్పష్టం చేశారు. 'మా ప్రజల అస్తిత్వాన్ని దెబ్బతీసే సర్వే రిపోర్టును దగ్థం చేస్తాం. కులగణన సర్వేపై సీఎం రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో చెప్పిన మాటలు పచ్చి అబద్ధాలు. జానారెడ్డిని బీసీల ద్రోహిగా ప్రకటిస్తున్నాం. ఖబడ్ధార్'అంటూ తీన్మార్ మల్లన్న స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.'నీవు చేసిన మోసం..కుట్రనే ఇదంతా. రాహుల్ గాంధీ పార్లమెంటులో చెప్పిన మాటలకు విరుద్ధంగా ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేసి 40లక్షల బీసీలను గల్లంతు చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ మేరకు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కావాలని..టికెట్లు కాదు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని పదికాలల పాటు కాపాడుకోవాలన్న ఆలోచన రాష్ట్ర నాయకత్వానికి లేదు'అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపించారు.
తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ
కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ ఊహించని ఝలక్ ఇచ్చింది. పీసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేను పార్టీ ఎమ్మెల్సీ అయి ఉండి తప్పుబట్టడమే కాకుండా అభ్యంతరకరమైన భాషతో విమర్శలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కులగణన ఫామ్‌ను దగ్థం చేయడంపై వివరణ ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కులగణన ప్రతులను దగ్ధం చేసినందుకు...అభ్యంతరకర భాష ప్రయోగించినందుకు వివరణ కోరింది. ఒకవేళ వివరణ ఇవ్వకపోతే సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఓ వైపు శాసన సభ, శాసన మండలిలో కుల గణన నివేదిక వివరాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మల్లన్న కులగణనను తప్పుబడుతూ విమర్శలు చేయడం.. ఆప్రతులను దగ్ధం చేయడం బీసీ వర్గాల్లో సర్వేపై అనుమానాలను.. అపోహలను పెంచేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa