ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీసు శాఖలో ఆర్మడ్ రిజర్వ్ విభాగం పాత్ర చాలా కీలకం: ఎం. శ్రీనివాస్ ఐపిఎస్..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 08, 2025, 02:11 PM

రామగుండం పోలీస్ కమీషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో నూతనంగా పునరుద్దరణ చేసిన అర్ముడ్ అధికారుల కార్యాలయాలు,సిబ్బంది బ్యారక్,ఎం. టి ఓ ఆఫీస్ వద్ద పోలీస్ వాహనాలు వాటర్ సర్వీస్ కోసం ఏర్పాటు చేసిన సర్వీసింగ్ పాయింట్ ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం ముఖ్య అతిథి గా వచ్చిన రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ కి పుష్పగుచ్చంతో స్వాగతం అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, ఏ ఆర్ ఏసీపీ ప్రతాప్,ఆర్ఐ లు  అనంతరం నూతనంగా పునరుద్దరణ చేసిన ఎం. టి. ఓ ఆఫీస్, ఆర్ఐ అడ్మిన్,ఆర్ ఐ హోం గార్డ్స్ ఆఫీస్ , సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన నూతన బ్యారక్, బాత్ రూమ్స్ మరియు పరేడ్ గ్రౌండ్ లో  సెల్యూట్ బేస్ ప్రాంగణాన్ని శిలాఫలకంతో ప్రారంభించారు.
శాంతి భద్రతల పరిరక్షణలో సివిల్, ప్రధాన విభాగాలతో పాటు ఏఆర్ విభాగం కూడా ఎంతో సమర్థవంతంగా పనిచేస్తొందని సీపీ పేర్కొన్నారు.ఎన్నో సమస్యాత్మక పరిస్థితుల్లో, పండుగల బందోబస్తు, ఎన్నికల బందోబస్తు నిర్వహణ, గణేష్ నిమజ్జనం ఊరేగింపు వంటి విధుల నిర్వహణలో ఆర్మ్డ్ రిజర్వు పోలీసుల కృషి ఎంతో ఉందని అభినందించారు. ఈరోజు కమీషనరేట్ పోలీసు హెడ్ క్వార్టర్స్ లో నందు 15 రోజుల పాటు సాగిన కమీషనరేట్ అర్మడ్ రిజర్వ్ సిబ్బంది మొబిలైజేషన్ ముగింపు కార్యక్రమం లో పోలీస్ కవాతులో రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ముందుగా కమీషనరేట్ అర్మడ్ సిబ్బంది నుండి సీపీ గౌరవ వందనాన్ని స్వీకరించారు. 05  ప్లటూన్లతో ఏర్పాటు చేసిన ఈ పరేడ్ నకు ఆర్ ఐ అడ్మిన్ దామోదర్ ప్లటూన్ కమాండెర్ గా వ్యవహరించారు. పదిహేను రోజుల పాటు జరిగిన ఢీ - మొబిలైజేషన్ కార్యక్రమంలో ఇండోర్, ఔట్డోర్, ఫైరింగ్ ప్రాక్టీస్ లో పాల్గొన్నారని ఏ ఆర్ ఏసీపీ ప్రతాప్ సీపీ కి వివరించారు.అనంతరం ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ..పోలీస్ అధికారులు, సిబ్బంది సంక్షేమమే ప్రథమ కర్తవ్యంగా మీకోసం నేనున్నానని  అన్నారు. పోలీసులు క్రమశిక్షణ తో పాటు శారీరక దృఢత్వం  అలవాటు పడుతుంది చెప్పారు. ఆర్ముడ్ రిజర్వ్ సిబ్బంది మొత్తం ఒకే దగ్గరకు వచ్చి శిక్షణా సమయంలో నేర్చుకున్న అంశాలను మరోసారి గుర్తు చేసుకునే అవకాశం మోబిలైజేషన్ ద్వారా కలుగుతుందని అన్నారు. పోలీసుశాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ కలిగి ఉండాలని,భాద్యతగా తమ విధులను నిర్వర్తిస్తూ ప్రజలకు సేవలందించాలని సూచించారు.ఈ మొబిలైజేషన్ కార్యక్రమం ద్వారా శారీరక దృడత్వంతో పాటు మానసిక ఉల్లాసం కూడా లభిస్తుందని అన్నారు. అనంతరం అక్కడ పాల్గొన్న అధికారులు,సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే అట్టి సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపడతామని తెలియజేశారు. నిరంతరం విధులలో ఉండే పోలీసు అధికారులు,సిబ్బందికి వ్యక్తిగత, కుటుంబపరమైన, శాఖాపరమైన సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లపుడూ ముందుంటామని వివరించారు.ఈ డీ-మొబిలైజేషన్ పరేడ్ కార్యక్రమాన్ని సుందరంగా ఏర్పాటుచేసిన అధికారులను అభినందించారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి చేతన ఐపిఎస్., మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్ ఐపీఎస్., అడిషనల్ డిసిపి అడ్మిన్ సి రాజు., స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్రరావు, గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్, ట్రాఫిక్ ఏ సి పి జానీ నరసింహులు,ఏ ఆర్ ఎస్ సి పి ప్రతాప్, ఏ ఓ శ్రీనివాస్, ఆర్ఐ దామోదర్, వామన మూర్తి, మల్లేశం, సంపత్, ఇన్స్పెక్టర్ లు, సీఐలు, సిపిఓ సిబ్బంది, వివిధ వింగ్స్ అధికారులు సిబ్బంది,ఏ ఆర్ మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa