గోవిందారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి చెందిన బండపల్లి జశ్వంత్ 7వ తరగతి విద్యార్థి, ఎస్ జి ఎఫ్ సాఫ్ట్ బాల్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఎస్.జి.ఎఫ్ సెక్రెటరీ లక్ష్మీరామ్ నాయక్ ప్రకటించారు. మెదక్ లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి మహారాష్ట్రలో జరిగే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొననున్నట్లు వ్యాయామ ఉపాధ్యాయులు ప్రశాంత్ తెలిపారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు అష్పాక్ హుస్సేన్ మాట్లాడుతూ గ్రామస్థాయి నుండి జాతీయ స్థాయికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయం అని జాతీయస్థాయిలో కూడా గొప్ప ప్రదర్శన చేయాలని జశ్వంత్ కి షూ ప్రధానం చేశారు. పాఠశాల హింది ఉపాధ్యాయులు అబ్దుల్ మాజీద్ క్రీడా దుస్తులను బహుకరించారు.
![]() |
![]() |