వరంగల్ జిల్లా నర్సంపేట లో జరిగిన తొమ్మిదవ జాతీయ ఇన్విటేషన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో కోదాడలోని శ్రీమన్నారాయణ కాలనీకి చెందిన కోపో ఖాన్ కరాటే క్లబ్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి బంగారు పథకాలు సాధించినట్లు కోచ్ మాధవి లత సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు. విజేతలకు టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ రచ్చ శ్రీని బాబు బహుమతులు అందజేశారు అని తెలిపారు.
కాగా విజేతల్లో అండర్ సెవెన్ లో తుహీన గోల్డ్ మెడల్, అండర్ 8లో శాన్విత గోల్డ్ మెడల్, అండర్ 10 లో ఆరాధ్య గోల్డ్ మెడల్ అండర్ 13 లో తెర్థ గోల్డ్ మెడల్ బాలుర విభాగంలో అండర్ 9లో నాగరుద్ధ గోల్డ్ మెడల్ అండర్ 6 లో మీరా సిల్వర్ మెడల్, అండర్ 9 లో శ్రీ యాన్ సిల్వర్ మెడల్ అండర్ 15 లో సింధ సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నట్లు ఆమె తెలిపారు సందర్భంగా కోదాడ కోపోఖాన్ కరాటే క్లబ్ విద్యార్థులు జాతీయస్థాయిలో పథకాలు సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తూ విజేతలతో పాటు కోచ్ మాధవి లతను అభినందించారు
![]() |
![]() |