బాలికలకు చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని జాగృతి పోలీస్ కళా బృందం మరియు స్థానిక పోలీసులు తిప్పర్తి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లో సోమవారం రోజు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో ముందుగా మాదకద్రవ్యాల దుష్పరిణామా లు సెల్ ఫోన్లు వాడకం, మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా జరుగుతున్నటువంటి అనర్ధాలను వివరించారు స్థానిక ఎస్పీ శరత్ చంద్ర పవర్ రోడ్ సేఫ్టీ, రూల్స్, అండ్ రెస్పాన్సిబిలిటీస్ పై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు అనంతరం బాలికల సంక్షేమం ఎన్నో చట్టాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. చర్చలు, కౌన్సెలింగ్ ల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు, మహిళా చట్టాల అమలుతో పాటు బాలికల పరిరక్షణకు ప్రభుత్వాలు కృషి చేస్తుందన్నారు.
నేటి యువత మాదకద్రవ్యాలు సెల్ ఫోన్ల వాడకం వలన తల్లిదండ్రులను అప్రతిష్ట పాలు చేస్తున్నారని విద్యార్థి దశ నుండి ఒక గొప్ప లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యసాధన కోసం అహర్నిశలు కృషి చేయాలని బాలికలకు ఎదురవుతున్న సమస్యల పరిష్కారం పట్ల అవగాహన కలిగి ఉండాలని ఏవైనా సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు తమ గురువుల దృష్టికి తీసుకు వెళ్లాలని బాలికల చట్టాలైన సఖి, షీ టీమ్స్ ,పోక్సో చట్టాల గురించి అవగాహన కల్పించారు ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన ప్రిన్సిపల్ ఏ అపర్ణ పాఠశాలల్లో విద్యార్థులకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పరచడం ద్వారా విద్యార్థులు తమ భవిష్యత్తుని చక్కగా తీర్చిదిద్దుకుంటారని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో ఏఎస్ఐ రామ్మూర్తి, కళాబృందం సభ్యులు ఎస్కే హుస్సేన్ ,పురుషోత్తం, సత్యం, మురళి, పోలీస్ సిబ్బంది షాహిన్, సైదులు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
![]() |
![]() |