నేటి బిజీ లైఫ్‌స్టైల్, తిండి అలవాట్లు చాలా మంది ఆరోగ్యాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. డయాబెటిస్, కొలెస్ట్రాల్, ఊబకాయం వంటి సమస్యల్ని పెంచుతున్నాయి. వీటితో పాటు సంతానోత్పత్తి సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఎక్కువ మంది పురుషులు తక్కువ స్పెర్మ్ కౌంట్‌తో బాధపడుతున్నారు. అంతేకాకుండా వారి శుక్రకణాల నాణ్యత కూడా తగ్గుతుంది.
దీంతో.. సంతాన సామర్థ్యం తగ్గుతుంది. తక్కువ వీర్యకణాల సంఖ్య కారణంగా, గర్భధారణలో అనేక సమస్యలు ఉన్నాయి. దీంతో, చాలా మంది IVF వంటి పద్ధతులను ఫాలో అవుతాయి. వంధ్యత్వాన్ని నివారించడానికి, శుక్రకణాల సంఖ్యను మెరుగుపర్చడానికి కొన్ని విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
ఇక, న్యూట్రిషనిస్ట్ శ్వేతా షా శుక్రకణాల సంఖ్య, వాటి క్వాలిటీ పెంచే చిట్కాను షేర్ చేసుకున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ రెమిడీను పంచుకున్నారు. ఈ రెమిడీ చాలా సులభం. ఓ ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు ఉంటే చాలు.శ్వేతా షా షేర్ చేసుకున్న చిట్కా ఏంటి, దీన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చుద్దాం.
కావాల్సిన పదార్థాలు
కావాల్సిన పదార్థాలు
వెల్లుల్లి - ఐదు నుంచి ఆరు రెబ్బలు (పొట్టు తీసినవి)
నెయ్యి - ఓ రెండు టేబుల్ స్పూన్లు
తయారీ విధానం
తయారీ విధానం
ముందుగా ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. ఆ తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి అందులో నెయ్యి వేయండి. ఆ నెయ్యిలో వెల్లుల్లి రెబ్బల్ని వేసి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించండి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని మిక్సీలో వేసి మెత్తటి చూర్ణంలా చేసుకోండి. ఈ చూర్ణాన్ని 15 రోజుల పాటు తీసుకోండి. ఏ రోజు చూర్ణం ఆ రోజు తయారు చేసుకోండి. ఈ రెమిడీ వల్ల మగవారి శుక్రకణాల సంఖ్య పెరగడమే కాకుండా క్వాలిటీ మెరగవుతుంది.
శ్వేతా షా చెప్పిన చిట్కా
వెల్లుల్లి చేసే మ్యాజిక్ ఏంటి?
నిపుణుల అభిప్రాయం ప్రకారం వంటగదిలో ఉండే సాధారణ వెల్లుల్లి వీర్యకణాల సంఖ్యను పెంచడంలో సాయపడుతుంది. అంతేకాకుండా వీర్యకణాల నాణ్యతను మెరుగుపరచడంలో కూడా సాయపడుతుందని నిపుణులు అంటున్నారు. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది వీర్యకణాల సంఖ్యను పెంచడానికి సాయపడుతుంది. ఇంకా, వెల్లుల్లిలోని సెలీనియం వీర్యకణాల చలనశీలతను మెరుగుపరుస్తుంది. ఈ చిట్కాతో పాటు జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి.
సమతుల్య ఆహారం
ఈ రోజుల్లో చాలా మందికి ఏది పడితే అది తినడం అలవాటు అయిపోయింది. ముఖ్యంగా జంక్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన ఆహారాల్ని తింటున్నారు. వీటి వల్ల శుక్రకణాల సంఖ్య పడిపోతుంది. అందుకే వీటిని తినడం నివారించండి. వీటికి బదులు నట్స్, డ్రై ఫ్రూట్స్, అరటిపండ్లు, కాయధాన్యాలు, పండ్లు, కూరగాయలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాలు, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఫుడ్స్ చేర్చండి. వేయించిన ఆహారాలు, స్పైసీ ఫుడ్స్‌కి దూరంగా ఉండండి. షుగరీ డ్రింక్స్ తాగడం మానుకోండి.
వ్యాయామం
ఆరోగ్యానికి మాత్రమే కాదు శుక్రకణాల సంఖ్య మెరుగుపర్చడానికి వ్యాయామం మంచి ఆప్షన్. అందుకే రోజూ వ్యాయామం చేయండి. రోజుకి కనీసం ముప్పై నిమిషాలైనా వ్యాయామం చేయండి. ఉదయం లేచి వాకింగ్ లేదా జాగింగ్ చేయండి. ఇది శరీరానికి శక్తినిస్తుంది. స్పెర్మ్ కౌంట్‌ని మెరుగుపరుస్తుంది. వాకింగ్, జాగింగ్, రన్నింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాల్ని భాగం చేసుకోండి. ఇవి స్టామినా, స్పెర్మ్ కౌంట్ పెంచుతాయి.
ఈ విషయాలు ముఖ్యం
ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. ఊబకాయం కూడా స్పెర్మ్ కౌంట్‌పై ప్రభావం చూపుతుంది. అందుకే బరువు తగ్గడంపై ఫోకస్ పెట్టండి.
అధిక ఒత్తిడి ఆరోగ్యాన్నికి ప్రమాదకరం. ఒత్తిడిని నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. యోగా, ధ్యానం, ప్రాణాయమం వంటివి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
8 గంటల నిద్ర మంచి ఆరోగ్యానికి అనువైనది. కానీ రోజుకు సరైన 7 గంటలు నిద్రపోవడం కూడా మంచిది. మంచి నిద్ర స్పెర్మ్ కౌంట్‌ని మెరుగుపరుస్తుందని నిపుణలు అంటున్నారు.
వేడి నీటితో ఎక్కువగా స్నానం చేయడం, బిగుతుగా ఉండే దుస్తులు ధరించండి, ల్యాప్‌టాప్‌ని ఎక్కువసేపు ఒడిలో పెట్టుకోవడం, ధూమపానం స్పెర్మ్ కౌంట్‌ని ప్రభావితం చేస్తాయి. అందుకే వీటిని నివారించండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa