కాల్వ శ్రీరాంపూర్, పెద్దపల్లి జిల్లా, ఫిబ్రవరి 9 ఇదేనిజం :విలసంతమైన జీవనం కోసం, సులభంగా డబ్బు సంపాదించడానికి రాత్రిపూట సమయంలో ఇండ్ల తాళాలు పగలగొట్టి దొంగతనం చేయాలని నిందితులు మనుపతి శేఖర్, సంజీవ్ కుమార్, శివరాత్రి రమేష్, మరి కొంతమంది పరిచయస్తులు కలిసి దొంగతనం పాల్పడుతూ ఉండేవారు అని,అందులో భాగంగా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఈనెల 03 తేదీన ఇంట్లో దొంగతనం చేయడానికి తిప్పన వేణ ఎర్ర కొమురయ్య ఇంటి వెళ్లగా, అక్కడ మనుషులు ఉండడం చూసి, పక్కనే ఉన్న మేకల కొట్టం నుండి 03 మేకలను దొంగలించరు.
అలాగే అదే రాత్రి మల్యాల గ్రామంలో బొల్లి రాజయ్య చెందిన 02 మేకలను కూడా దొంగలించి తమ వాహనం కారు నంబర్ B. NO. TS. 29 H 0108, అలాగే నూతన బొలెరో వాహనం లో 05 మేకలను దొంగలించి చొప్పదండికి పారిపోయారని పోలీసులు తెలిపారు. మళ్లీ దొంగతనాలు చేసి డబ్బులు ఇంకా సంపాదించాలని దురుద్దేశంతో ఈ నెల 09 తేదీన దొంగతనం చేద్దామని మండల కేంద్రానికి నిందితులు వస్తుండగా, గంగారం మూలమలుపు వద్ద ఎస్సై వెంకటేష్, పోలీస్ సిబ్బంది, దొంగలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని, విచారించగా వారు దొంగలించిన ఐదు మేకలను చొప్పదండి ఉన్నాయని తెలుపగా, వారితో పాటు వెళ్లి దొంగలించబడిన మేకులను సాధనపరచుకున్నట్లు ఎస్ఐ వెంకటేష్ తెలిపారు. మిగిలిన దొంగల గురించి వెతికిన దొరకలేదు అని, వారు ప్రస్తుతం పారరిలో ఉన్నారని,అరెస్టు చేసిన దొంగలను కోర్టులో హాజరు పరిచి జైల్లో వేయడం జరిగిందని పోలీసులు తెలిపారు.
![]() |
![]() |