పెద్దపల్లి ఐటిఐ సెంటర్ ప్రాంగణంలో జరుగుతున్న ఏటిసి భవన నిర్మాణ పనులను మార్చి 1,2025 నాటికి పూర్తి చేయాలని లేబర్, ఎంప్లాయిమెంట్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్ కుమార్ అన్నారు. మంగళవారం లేబర్ , ఎంప్లాయి మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్ కుమార్ , జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో కలిసి పెద్దపల్లి ఐటిఐ ప్రాంగణంలో జరుగుతున్న ఏటిసి భవన నిర్మాణ పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా లేబర్ ,ఎంప్లాయిమెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్ కుమార్ మాట్లాడుతూ,6 ట్రేడ్ లతో యువతకు ఉపాధి శిక్షణ అందించేందుకు ఐటిఐ ప్రాంగణంలో నిర్మిస్తున్న ఏటిసి ( అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్) భవన నిర్మాణ పనులను మార్చి 1,2025 నాటికి పూర్తి చేయాలని,నిర్మాణ పనులు పూర్తి చేసిన తర్వాత పరికరాలను అమర్చెందుకు చర్యలు తీసుకొవాలని ప్రిన్సిపల్ సెక్రెటరీ తెలిపారు.6 ట్రేడ్ కోర్సులకు సంబంధించి పరికరాలు ఐటిఐ కు చేరుకున్నాయని, భవన నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే సంబంధిత పరికరాలను ఇన్ స్టాల్ చేసి యువతకు శిక్షణ తరగతులు ప్రారంభించవచ్చని అన్నారు.భవన నిర్మాణ పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
పెద్దపల్లి ఐటిఐ కేంద్రం విద్యార్థులతో ఆయన ముచ్చటించారు.ఐటిఐ సెంటర్ కు ఉన్న విద్యుత్ బకాయిలు 15 లక్షల 80 వేల రూపాయలను త్వరలో మంజూరు చేస్తామని అన్నారు.ఐటిఐ సెంటర్ ప్రహారి కూడా మరమ్మత్తులకు ప్రతిపాదనలు తయారు చేయాలని అన్నారు. అనంతరం ఎటిసి సెంటర్ ప్రాంగణంలో కలెక్టర్ తో కలిసి ప్రిన్సిపల్ సెక్రెటరీ మొక్కలు నాటారు.ఈ పర్యటనలో ప్రిన్సిపాల్ సెక్రటరీ వెంట ఐటిఐ ప్రిన్సిపాల్ బుచ్చిరెడ్డి వెంకటరెడ్డి,సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |