ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని జిల్లా మాత శిశు సంరక్షణ అధికారి డాక్టర్ జైపాల్ రెడ్డి సూచించారు. మెట్ పల్లి పట్టణంలోని సామాజిక ఆసుపత్రిలో మెట్ పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, జగ్గాసాగర్ ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు, సూపర్ వైజర్ లతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మెట్ పల్లి సామాజిక ఆసుపత్రిలో గతంలో నెలలో 300 ప్రసవాలు జరిగితే ప్రస్తుతం 100 కూడా జరగడంలేదని అన్నారు. గతంలో మాదిరిగా ప్రసవాలు అధికంగా జరిగేలా ఆరోగ్య కార్యకర్తలు కృషి చేయాలన్నారు.
సాధారణ ప్రసవాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యులకు సూచించారు ఈ సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సాజిద్ అహ్మద్, జగ్గసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ అంజిరెడ్డి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ లింగా రామ్మోహన్, విజయభాస్కర్, హెచ్ ఈ ఓ రామ్మోహన్, హెల్త్ సూపర్ వైజర్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |