కాంగ్రెస్ పార్టీకి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు షాక్ ఇచ్చారు. కమ్యూనిస్టులను సమన్వయంలో కాంగ్రెస్ విఫలం అవుతోందని ఫైర్ అయ్యారు. సీపీఐ మద్దతుతో గెలిచామన్న విషయాన్ని మర్చిపోవద్దని చురకలు అంటించారు. దేశవ్యాప్త పరిణామాలను చూస్తూ కూడా మారరా? అంటూ ప్రశ్నించారు. కమ్యూనిస్టులను కలుపుకుపోవడం లేదని మండిపడ్డారు. రుణమాఫీ రూ.2 లక్షల విషయంలో కొంత వైఫల్యం చెందారన్నారు. ప్రభుత్వంలో ఎవరూ ఫోన్ కాల్స్ తీయడంలేదని ఆరోపించారు.
![]() |
![]() |