ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్టీనేతలతో కేసీఆర్ విస్తృత సమావేశం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2025, 03:39 PM

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి కేసీఆర్ హాజరవుతుండడంతో దీనిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించింది. ఈ ఏడాది 25వ వసంతంలోకి ప్రవేశించబోతోంది. ఈ నేపథ్యంలో నేడు తెలంగాణ భవన్ లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ లు, జిల్లా అధ్యక్షులు, ఇతర విభాగాల అధ్యక్షులు హాజరవుతున్నారు. ఈ సమావేశం గురించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ... పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణ, సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర అంశాలపై చర్చించనున్నట్టు తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa