ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వికారాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 21, 2025, 05:15 PM

వికారాబాద్ పట్టణ లోని గౌలికర్ నర్సింగ్ ఫంక్షన్లో నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను  తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై కబడ్డీ పోటీలను ప్రారంభించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలకు 2 % ఉద్యోగాలకు వర్తిస్తదని చెప్పడం జరిగింది. విద్యార్థిని విద్యార్థులు అందరూ క్రమశిక్షణతో  ఉన్నత శిఖరాలను అధిరోహించాలని  విద్యార్థులకు సూచించడం జరిగింది.
ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ శారీరక, వ్యాయామాలతో ప్రతిరోజు  30 నిముషాలు చేయాలి. ఇలా చేస్తే ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు పరశురాం నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల లో అన్ని జిల్లాల నుంచి వచ్చిన  విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa