ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడమే లక్ష్యం...

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2025, 01:11 PM

జూలపల్లి మండలం చీమల పేట గ్రామ శివారులోని డి- 86 మెయిన్ కెనాల్ కు చెందిన 10ఎల్ కాల్వకు సంబంధించిన 1ఎల్ ఉప కాలువ ద్వారా నీరు సక్రమంగా అందడం లేదని పలువురు రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.దీంతో తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే శుక్రవారం సంబంధిత అధికారులను పిలిపించి 1ఎల్ ఉపకాల్వను సందర్శించి కాల్వ పరిస్థితిని పరిశీలించారు. ఈ ఉప కాలువ ద్వారా చీమల పేట నుండి ఎలిగేడు మండలం దూళికట్ట గ్రామ రైతులకు సక్రమంగా సాగునీరు సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఎస్సారెస్పీ అధికారులకు సూచించారు.
కాల్వ లీకేజీ లకు తక్షణమే మరమ్మత్తులు చేయించాలని అధికారులను కోరిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు..ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామ రాజేశ్వర్ రెడ్డి, సంతోష్ రావు, పర్శరాములు,తోటి మధుకర్ తోటి బుచ్చయ్య,సమ్మయ్య, అశోక్,తదితరులు చీమల పేట,ధూళికట్ట రైతులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa