ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పట్టభద్రుల హక్కుల కోసం డాక్టర్ వూట్కూరి నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిద్దాం : మెట్టు సాయి కుమార్, కాట శ్రీనివాస్ గౌడ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 24, 2025, 08:52 PM

పటాన్‌చెరులో మెదక్-నిజామాబాద్-అదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల సన్నాహక సమావేశం
మెదక్, నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ డాక్టర్ వూట్కూరి నరేందర్ రెడ్డి గారికి మద్దతుగా, పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రామచంద్రాపురం సితార గ్రాండ్ హోటల్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు, తెలంగాణ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఆంక్ష రెడ్డి గారు, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ శివాంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు, పట్టభద్రులు హాజరయ్యారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాత్రమే విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తోంది. పట్టభద్రుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వమే సమర్థవంతమైన విధానాలను అమలు చేస్తోంది. అందుకే పట్టభద్రుల మెరుగైన భవిష్యత్తు కోసం, వారి హక్కులను కాపాడేందుకు, ఉత్తమ నాయకత్వాన్ని అందించేందుకు డాక్టర్ వూట్కూరి నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఎమ్మెల్సీగా గెలిపించుకోవడం అవసరం. ప్రతి పట్టభద్రుడు ఈ ఎన్నికలో ఓటు హక్కును వినియోగించుకుని, కాంగ్రెస్ అభ్యర్థిని విజయపథంలో నిలపాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa