ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 25, 2025, 11:08 AM

తెలంగాణ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసును మంగళవారం సుప్రీంకోర్టు విచారించనుంది. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ పార్టీ స్పీకర్‌‌ను కోరింది. అయితే స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును ఇటీవల విచారించిన కోర్టు స్పీకర్‌కు కొంత సమయం ఇచ్చింది. ఈ క్రమంలో నేడు తుది విచారణ చేపట్టే అవకాశం ఉంది.వీరిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ తొలుత హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఈ విషయంపై సీరియస్ గా పరిగణనలోకి తీసుకుని అనేక విధాలుగా కామెంట్స్ చేయడంలో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్న నేపథ్యంలో నేటి విచారణ ఎలా సాగుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa