ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏడుపాయల లో భక్తులు రద్దీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 26, 2025, 11:57 AM

మంజీరా నది తీరాన రాతిగుహలో వెలిసిన వనదుర్గమ్మ జాతరకు ముస్తాబైంది. ఏటా మహాశివరాత్రికి నిర్వహించే ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. బుధవారం అమ్మకు మంత్రి దామోదర రాజనర్సింహ పట్టువస్త్రాలు సమర్పించి వేడుకలకు శ్రీకారం చుట్టనున్నారు. మూడు రోజులు కనులపండువగా జరిగే జాతరకు సర్వం సిద్ధం చేశారు.మహాశివరాత్రి సందర్భంగా తొలిరోజు బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు అమ్మవారికి పంచామృతాభిషేకం చేపట్టి ప్రత్యేకంగా అలంకరిస్తారు. సహస్రనామార్చన, కుంకుమార్చన చేపట్టి 5.30 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు. రెండో రోజు గురువారం సాయంత్రం ప్రధాన ఘట్టం బండ్ల ఊరేగింపు ఉంటుంది. చివరి రోజు శుక్రవారం రాత్రి రథోత్సవం చేపడతారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa