హైదరాబాద్‌లో రంజాన్ సంబరాలు హలీం లేకుండా పూర్తవ్వవు. ప్రతి సంవత్సరం.. హలీం ప్రియులు ఏ హోటల్‌లో హలీం బెస్ట్ అన్నదానిపై చర్చించుకుంటారు. ప్రసిద్ధ హోటళ్లతో పాటు కొత్తగా వచ్చిన హలీం కేంద్రాలు కూడా తమ ప్రత్యేకతతో ఆకట్టుకునేందుకు పోటీ పడతాయి. సాంప్రదాయ భట్టి హలీం నుంచి మోడరన్ వేరియంట్స్ వరకు.. హైదరాబాద్‌లో హలీంపై మోజు రోజురోజుకూ పెరుగుతోంది. హైదరాబాద్‌లో ఓ హోటల్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.. అదే హోటల్ సిటీ డైమండ్. హైదరాబాద్‌లోని హలీం ప్రియులకే కాదు.. గతకొన్నేళ్లుగా ఎంతోమందికి ఇష్టమైన చోటుగా నిలిచింది హోటల్ సిటీ డైమండ్. గత ఏడాది కూడా ఈ హలీం కోసం ప్రజలు గంటల కొద్దీ క్యూలో నిల్చుండేవారు. అయితే ఈ సంవత్సరం.. సోషల్ మీడియా ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ ప్రభావంతో.. హోటల్ సిటీ డైమండ్ మరింత పాపులర్ అయింది. ఇక్కడి హలీం రీల్స్, వీడియోలు చూసి వందల మంది ఈ హోటల్‌కి వచ్చి హలీం రుచి చూస్తున్నారు. ఈ సీజన్‌లో అత్యంత చర్చనీయాంశంగా నిలిచిన హలీం సిటీ డైమండ్‌దే.
సిటీ డైమండ్ హలీం కేవలం సోషల్ మీడియా వల్లే ఫేమస్ అవలేదని అర్థం చేసుకోవాలి. ఇక్కడ హలీం రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. తిన్న వారిని నిజంగా రుచితో మంత్రముగ్ధుల్ని చేస్తుంది ఇక్కడి హలీం. దాని ప్రత్యేకత ఏమిటంటే.. ఇది మృదువుగా, మాంసాహార రుచితో అద్భుతంగా ఉండటం. భట్టీలో నెమ్మదిగా ఉడికించబడే ఈ హలీంలో ప్రతి పదార్థం సమపాళ్లలో కలిసిపోతుంది.
"ఈ హలీంలో మాంసం, పెసరపప్పు నిష్పత్తి చాలా సరిగ్గా ఉంటుంది. ఇతర హలీమ్‌లలో కొన్నిసార్లు ఎక్కువ కొవ్వు, ఎముకలు ఎక్కువగా ఉంటాయి. ఇది తినే వారికి కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ సిటీ డైమండ్ హలీం చాలా స్మూత్, తేలికగా ఉంటుందనే ఒక కస్టమర్ చెప్పాడు. హోటల్ సిటీ డైమండ్.. మెహదీపట్నం ప్రాంతంలో ఉంది. దీనికి ఏ విధమైన బ్రాంచీలు కూడా లేవు. ఈ హలీం ఎటువంటి ఫుడ్ డెలివరీ యాప్‌లో అందుబాటులో లేదు. కేవలం హోటల్‌కే వెళ్లాలి.
ఈ హోటల్ ముందు ఇఫ్తార్ సమయానికి పెద్ద క్యూలు కనపడతాయి. రంజాన్ రోజుల్లో ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి హలీం అందుబాటులో ఉంటుంది. ఇక్కడ ఒక ప్లేట్ హలీం రూ.180, ఫ్యామిలీ ప్యాక్ రూ.500, డైమండ్ స్పెషల్ రూ.700లుగా ఉంటుంది. ఈ ధరల్లో కాస్త అటూ ఇటూ మార్పులు ఉండవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa