తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని భావిస్తోంది. ఈ సమావేశానికి ప్రతి రాజకీయ పార్టీని ఆహ్వానించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకుంది.
పునర్విభజనతో ఎదురయ్యే పరిణామాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. త్వరలో వేదిక, తేదీని ప్రభుత్వం ఖరారు చేయనునుంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జానారెడ్డి లేఖను విడుదల చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa