గ్రూప్-2 పరీక్షలో ప్రతిభ చూపించి 25వ ర్యాంక్ సాధించిన ఎస్‌ఐ శివగౌడ్ ను జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ గురువారం అభినందించి ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ క్రమశిక్షణ, కఠిన సాధన, పట్టుదల ఉంటే ఏ లక్ష్యమైనా సాధించవచ్చని తెలిపారు.
మహబూబాబాద్ టౌన్ ఎస్సై శివ తన విధులను నిర్వహిస్తూ, చదువుపై ఆసక్తి కనబరచి ఉన్నతర్యాంక్ సాధించడం, ఇతర పోలీస్ అధికారులకు ప్రేరణగా నిలుస్తుందని ప్రశంసించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa