తెలంగాణలో మద్యం ధరలు మరోసారి పెరగనున్నాయి. మద్యం సరఫరా కోసం ప్రభుత్వం లిక్కర్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందం జూన్ 30తో ముగియనుంది. దీంతో ఏప్రిల్ మొదటి వారంలో ధరలు పెంచి, ఆ వెంటనే ఒప్పందాలు చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. చీప్ లికర్, మీడియం, ప్రీమియం, విదేశీ దిగుమతి లికర్ ప్రాథమిక ధర మీద 18 శాతం పెంచడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీర్ల ధరలను కూడా మరోసారి రూ.10 పెంచనున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa