ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పది

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 18, 2025, 03:41 PM

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ తహశీల్ధార్ కార్యాలయ ఆవరణలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ డిఎండి తాహెర్ ఆధ్వర్యంలో తహశీల్ధార్ జ్యోతి మంగళవారం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా తహశీల్ధార్ మాట్లాడుతూ అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని.. ఆపదలో ఉన్న సాటి వ్యక్తుల ప్రాణాలను కాపాడండని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ఎంపీడీఓ వెంకటయ్య, మీసేవ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa