ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గత ప్రభుత్వ హయాంలో నాటిన మొక్కల్లో ప్రజలకు హాని కలిగించే కోనోకార్పస్ చెట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయని అన్నారు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 25, 2025, 06:17 PM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో హరితహారం కార్యక్రమంపై ఆసక్తిర చర్చ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 200 కోట్ల మొక్కలు నాటామని, దీనివల్ల రాష్ట్రంలో అటవీ కవచం 7 శాతం పెరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పందిస్తూ గత ప్రభుత్వ హయాంలో నాటిన మొక్కల్లో ప్రజలకు హాని కలిగించే కోనోకార్పస్ చెట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయని అన్నారు. ఈ చెట్లు ఆక్సిజన్ ఉత్పత్తికి హానికరంగా మారతాయని పక్షులకు కూడా సహజమైన వాతావరణాన్ని అందించలేవని చెప్పారు. వేముల మాట్లాడుతూ ఈ చెట్లను కొద్ది సంఖ్యలోనే నాటామని చెప్పారు. మీరు చెప్పింది కరెక్ట్ కాదని ఈ చెట్లను పెద్ద సంఖ్యలో నాటారని స్పీకర్ కౌంటర్ ఇచ్చారు. హైవేలు, డివైడర్లు సహా అనేక ప్రాంతాల్లో ఈ చెట్లు కనిపిస్తున్నాయని తెలిపారు. ఈ చెట్లను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa