పౌరులను అప్రమత్తం చేసేందుకు వినియోగించే సైరన్‌లను వార్తా కార్యక్రమాల్లో ఉపయోగించవద్దని మీడియా ఛానెళ్లకు కేంద్రం సూచించింది. కేవలం మాక్ డ్రిల్‌ల సమయంలో పౌరులకు అవగాహన కోసం మాత్రమే వినియోగించాలని పేర్కొంటూ అడ్వైజరీ జారీ చేసింది. ‘ఇలా తరచుగా ఈ శబ్దాలు వినియోగించడం ప్రజల్లో గందరగోళానికి దారితీస్తాయి. దీంతో వాస్తవంగా అత్యవసర సమయాల్లో వీటిని మోగించినప్పుడు పౌరులు వీటిని తేలికగా తీసుకునే ప్రమాదం ఉంది’ అని పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa