కామారెడ్డిలోని ఒక ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మానస అనే గర్భిణీకి రక్త దాతల సేవా సమితి అధ్యక్షుడు బోనగిరి శివకుమార్ 49వ సారి రక్తదానం చేసారు. ఈ సందర్భంగా, రక్తదానం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేందుకు రక్తదాతల సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
గత 20 సంవత్సరాలుగా రక్తదానం చేస్తున్న బోనగిరి శివకుమార్, తన మిత్రులతో కలిసి రక్తదానాన్ని ప్రోత్సహిస్తూ, సమాజంలో అత్యవసర సమయంలో రక్తం ఇవ్వడం యొక్క అవసరాన్ని తెలియజేయడం కోసం రక్తదాతల సేవా సమితిని స్థాపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa