భూపాలపల్లి: భూపాలపల్లి పోలీస్ కంట్రోల్ రూమ్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సతీష్‌పై దాడి జరిగింది. ఈ ఘటనలో బెల్లంపల్లి నివాసితులైన అజీమ్, రోహిత్, సుబ్బు, మరొక రోహిత్‌లపై కేసు నమోదైనట్లు వన్ టౌన్ ఎస్‌హెచ్‌ఓ దేవయ్య తెలిపారు.
సతీష్ తన స్వగ్రామమైన బెల్లంపల్లికి వచ్చి బైక్‌పై వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన ఓ కారు బైక్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న వారితో సతీష్ వాగ్వాదానికి దిగాడు. ఈ దురాంతంలో సదరు వ్యక్తులు సతీష్‌పై కర్రలతో దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. బాధితునికి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa