డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన ఓ కూలీకి నాలుగు రోజుల జైలు శిక్ష విధించారు. సోమవారం రాత్రి జగిత్యాల జిల్లా గోవిందుపల్లి చౌరస్తాలో ట్రాఫిక్ ఎస్‌ఐ మల్లేష్ పర్యవేక్షణలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో బసంత్ ఠాకూర్ అనే వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతుండగా పట్టుబడ్డాడు. అతను ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
ఆ తర్వాత అతన్ని మంగళవారం నాడు స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ జి. కరుణాకర్ గారి ముందుకు హాజరుపరచగా, న్యాయమూర్తి నాలుగు రోజుల జైలు శిక్ష విధించారు. ఈ విషయం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మీడియాతో తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa