దుబాయ్లో జరిగిన వరల్డ్ పోలీస్ సమ్మిట్ (WPS)–2025లో హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ తరఫున శుక్రవారం ప్రాతినిధ్యం వహించిన సీవీ ఆనంద్, “ఎక్స్లెన్స్ ఇన్ యాంటీ-నార్కోటిక్స్ అవార్డు”లో ప్రపంచ స్థాయిలో తొలి స్థానాన్ని సాధించారు.
మాదకద్రవ్యాల నియంత్రణలో హైదరాబాద్ పోలీసులు చేపట్టిన కట్టుదిట్టమైన చర్యలు, విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు, వినూత్న విధానాలు ఈ అవార్డుకు కారణమయ్యాయి. సీవీ ఆనంద్ నాయకత్వంలో హైదరాబాద్ నగరం మాదకద్రవ్యాల నిర్మూలనలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ అంతర్జాతీయ గుర్తింపు హైదరాబాద్ పోలీసు శాఖకు, ముఖ్యంగా నార్కోటిక్స్ విభాగానికి గర్వకారణంగా నిలిచింది.
![]() |
![]() |