హైదరాబాద్‌లోని గుల్జార్‌హౌస్ వద్ద సంభవించిన ఘోర అగ్ని ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అదే విధంగా, మంత్రి నారా లోకేశ్ కూడా ఈ ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. బాధితులకు సంతాపం తెలుపుతూ, గాయపడినవారి ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa