ఉపరితల ఆవర్తనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలలో అకాల వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రభావంతో రేపు (సోమవారం) తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
వాతావరణ శాఖ ప్రకారం, హైదరాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, ఉమ్మడి కరీంనగర్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్షసూచనలు జారీచేశారు. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో పాటు వడగళ్ల వర్షం కురిసే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. పంటలను సంరక్షించుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సలహా ఇచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa