జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏడేళ్ల బాలికను సెల్‌ఫోన్ ఇచ్చి ఆకర్షించి, 70 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇద్దరూ ఒకే కాలనీలో నివసిస్తున్నారు. బాలిక ఆడుకోవడానికి వెళ్లిన సమయంలో ఈ దుర్మార్గం జరిగింది.
బాలిక నానమ్మకు అనుమానం రావడంతో ఆరా తీయగా, ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బాలిక బంధువులు వెంటనే పోలీసులను సంప్రదించగా, నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa