ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉపాధి కూలీల సమస్యలపై నేతల డిమాండ్.. రోజుకు రూ.600 కూలి ఇవ్వాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 24, 2025, 02:31 PM

సీఐటీయూ జిల్లా కార్యదర్శి బలరాం శనివారం ఉపాధిహామీ కూలీలకు రోజుకు రూ.600 కూలి చెల్లించాలని డిమాండ్ చేశారు. నారాయణపేట మండలం చిన్నజట్రం గ్రామ శివారులో ఉపాధి కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెండింగ్లో ఉన్న కూలీ డబ్బులను వెంటనే చెల్లించాలని, పని ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. 
ఈ నెల 30న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాకు కూలీలు భారీగా తరలిరావాలని బలరాం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa