చెన్నై ఎయిర్‌పోర్టులో ప్రముఖ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సూర్యాపేట జిల్లా నూతనకల్‌కు చెందిన సన్నీ యాదవ్, బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేస్తున్నాడని నూతనకల్ పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ బైక్ టూర్‌ను పూర్తి చేసినట్లు ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సన్నీ యాదవ్ తిరిగి ఇండియాకు రాగా, చెన్నై ఎయిర్‌పోర్టులో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. సన్నీ యాదవ్ అరెస్టును పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa