ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 03, 2025, 02:21 PM

రైతుల సంక్షేమమే ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. మంగళవారం ఉట్కూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయం వద్ద రైతులకు వరి, కంది విత్తనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులు నాణ్యమైన విత్తనాలను ఉపయోగించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. 
పంటల సాగులో వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలను పాటించాలని, ఆధునిక పంట యాజమాన్య పద్ధతులను అనుసరించాలని ఆయన రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa