జగిత్యాల పట్టణంలోని 40వ వార్డు పురాణిపేటలో 20లక్షలతో బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మంగళవారం భూమిపూజ చేశారు. అనంతరం శ్రీ ఆంజనేయ ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన, మాజీ మున్సిపల్ చైర్మన్ లు అడువాల జ్యోతి లక్ష్మణ్, గిరి నాగభూషణం, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ అవారీ శివ కేసరి బాబు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa