మేడ్చల్ నియోజకవర్గంలోని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా, 13వ డివిజన్‌లో 'ఒక మార్పు అభివృద్ధికి మలుపు' కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్, టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్, మాజీ కార్పొరేటర్ పద్మారెడ్డి మంగళవారం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా, ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా భూమిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా అర్హులైన పేదలకు గృహ సౌకర్యం కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa