సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో మేడిపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. క్లబ్ అధ్యక్షులు లయన్ వేముల కేశవ నాదము గౌడ్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమం, లయన్ దాస నర్సయ్య 47వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని చేపట్టారు.
మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో, ఆసుపత్రిలోని ఇన్‌పేషెంట్ అటెండర్లకు ఆహార పంపిణీ జరిగింది. ఈ సేవా కార్యక్రమం ద్వారా రోగుల సంరక్షకులకు అండగా నిలిచిన మేడిపల్లి లయన్స్ క్లబ్ సభ్యులు, సామాజిక సేవలో తమ నిబద్ధతను చాటుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa