తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 14న సీఎం రేవంత్ తుంగతుర్తిలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మొత్తం 2 లక్షలకు పైగా లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులు అందజేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఇప్పటికే అర్హత పొందిన దరఖాస్తుదారుల జాబితా సిద్ధమైంది. రేషన్ కార్డు కోసం నిరీక్షిస్తున్న కుటుంబాలకు ఊరట కలగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa